Saturday, January 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు కమిషన్‌ పనితీరు భేష్‌

రైతు కమిషన్‌ పనితీరు భేష్‌

- Advertisement -

– రైతుల్లో మరింత అవగాహన కల్పించాలి
– పంట మార్పిడిపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి
– అవసరమైతే అదనపు నిధులు ఇవ్వడానికి సిద్ధం : సీఎం రేవంత్‌రెడ్డి
– రైతు కమిషన్‌ చైర్మెన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఊహించిన దానికంటే రైతు కమిషన్‌ పనితీరు భేష్‌గా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రైతు కమిషన్‌ సభ్యులు కలిశారు. రైతుల్లో మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిషన్‌కు సూచించారు. పంట మార్పిడి విధానం, సేంద్రియ వ్యవసాయంలపై రైతుల్లో చైతన్యం పెంచేలా అవేర్‌నెస్‌ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలనీ, అవసరమైతే రైతు కమిషన్‌కు అదనపు నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పప్పుదినుసుల సాగు రాష్ట్రంలో తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తృణధాన్యాలు, పప్పుదినుసుల సాగును పెంచేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కేరళ, హర్యానా పర్యటనల అనుభవాలను సీఎంకు రైతు కమిషన్‌ సభ్యులు వివరించారు. కూరగాయల సాగు, మార్కెటింగ్‌ విధానంలో కేరళ పాలసీ బాగుందని సీఎంకు రైతు కమిషన్‌ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల కూరగాయల సాగు పెంచేలా కమిషన్‌ పనిచేస్తుందని తెలిపారు. రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి పుట్టిన రోజు అనే విషయం తెలియగానే ఆయనకు సీఎం బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు రైతు కమిషన్‌ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో కోదండరెడ్డితో పాటు కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌ రెడ్డి, గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, భూమి సునీల్‌, భవానీ రెడ్డి, కమిషన్‌ సెక్రటరీ జనరల్‌ గోపాల్‌, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -