- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను బలంగా ఢీకొట్టింది. దీనితో విమానం ముందుభాగం చక్రం దెబ్బతిన్నది. దీంతో రన్‌వేను మూసివేస్తూ విమానాశ్రయం అధికారులు నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్) జారీ చేశారు. బోయింగ్ 737 మ్యాక్స్8 విమానం ఉదయం 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.40 గంటలకు థాయ్‌లాండ్‌లో హార్డ్ ల్యాండ్ అయింది. అధికారులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.
- Advertisement -



