Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండు టెండలో ప్రయాణికుల అవస్థలు…!

మండు టెండలో ప్రయాణికుల అవస్థలు…!

- Advertisement -

-బ‌స్ షెల్టర్ లేక ఇబ్బందులు
-బస్సుల కోసం పడిగాపులు
-ఎండలో నిలబడ్డ విద్యార్థులు
నవతెలంగాణ -పెద్దవూర
:నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కేంద్రంలో శాశ్వత బస్టాండ్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రయాణికులు రోడ్డు పక్కన బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.కనీసం బస్ షెల్టర్ లేక ఎండలో నానా అవస్థలుపడుతున్నారు.
మండే ఎండలో, వర్షం పడుతున్నసమయంలో వర్షం లో  ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, అధికారులు బస్‌ షెల్టర్ల నిర్మాణాన్ని  పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడం తో  మండు టెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క బ‌స్ షెల్టర్ కూడా లేక  అవస్థ పడుతున్నారు. బస్సుల కోసం నాగార్జున సాగర్ -హైదరాబాద్,కోదాడ -జెడ్చర్ల జాతీయ రహదారిపై ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు పెద్దవూర కావడం వల్ల వందలమంది ప్రయాణికులు హైదరాబాద్‌,గుంటూరు,దేవరకొండ,మిర్యాలగూడ,కోదాడ,నల్గొండ,మాచర్ల,వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కు మెయిన్ సెంటర్ గా పెద్దవూర ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్‌ లేకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు,విద్యార్థులు,రోడ్డుపైనే నిలబడి మండు టెండలో బస్సుల కోసం వేచి సూస్తున్నారు.
పెద్దవూర మండల కేంద్రానికి 3 కిలోమీటర్లు దూరం లో వున్న పినవూర స్టేజీ వద్దకూడా బస్ షెల్టర్ వుంది.ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాస్ట్రాల సరిహద్దు లో
పెద్దవూర కేంద్రం మీదుగా వందకు పైగా  బస్సులు
ప్రతిరోజు వెళుతుంటాయి.అయినా ఒక చిన్న వర్షానికి,ఎండకు నిలబడానికి కూడా బస్ షెల్టర్ ఏర్పాటు చేయలేదు.ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్‌ లేకపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రోడ్డుపైనే గంటలకొద్ద నిలబడుతున్నారు..ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కనీసం బస్ షెల్టర్ ఏర్పాటు స్థానికులు,ప్రయాణికులు కోరుతున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -