పట్టింపు లేని అధికారులు
నవతెలంగాణ – శాయంపేట
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేనిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. వసంత పూర్ నుండి సూర్యా నాయక్ తండ వెళ్లే దారి పొడవునా కంకర తేలి ఉంది. ఆ రహదారి గుండా వాహనదారులు ప్రయాణాలు చేయాలంటేనే జంకుతున్నారు. వర్షం కురిస్తే గుంతలలో నీరు చేరి దారి కనిపించకుండా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలానికి దూరంగా ఉందనే నెపంతో ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ మార్గంలో గోరుకొత్తపల్లి నిజాంపల్లి కాట్రపల్లి రైతులు వాహనదారులు నిత్యం ఏదో ఒక పని మీద వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆ రోడ్డు మార్గం మొత్తం కంకర తేలి గుంతలుగా మారి వర్షం తాకిడికి మరింత డ్యామేజ్ అయినది. సంబంధిత పంచాయతీరాజ్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరంగా ఉన్న రోడ్ మార్గాన్ని వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుంతలమయమైన గంగిరేనిగూడెం రోడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



