Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుతునికాకు కట్టకు రూ.4 పెంచాలి:సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్

తునికాకు కట్టకు రూ.4 పెంచాలి:సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట: తునికి ఆకు కూలీలకు ఒక కట్టకు 4 రూపాయలు పెంచి ఇవ్వాలని, 2020 నుండి పెండింగ్‌లో ఉన్న బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. పసర పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం తుమ్మల వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవి కుమార్ హాజరైయ్య‌రు మాట్లాడుతూ.. తునికి ఆకు సేకరణ ములుగు జిల్లాలో గిరిజనులు గిరిజనేతరులు అత్యధికంగా చేస్తారని ప్రతి కుటుంబానికి ఒక పంటగా భావిస్తారని పేర్కొన్నారు ప్రభుత్వం 50 ఆకుల కట్టకు మూడు రూపాయల 70 పైసలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది, పెరుగుతున్న ధరలకు అనుగు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే కాంట్రాక్టర్లు అడవిలో ఫ్యూనిo గ్ కార్యక్రమం చేపట్టాలని పెంచాలని, అదేవిధంగా లోడింగ్ కు గతం కంటే 25% అధికంగా ఇవ్వాలని పేర్కొన్నారు.

తునికాకు బోనస్ గతంలో 2016 నుండి 2021 వరకు 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఆ డబ్బులు తునికాకు కూలీలకు అందలేదని, వెంటనే బోనస్ తునికాకులకు అందించాలని డిమాండ్ చేశారు, 2021 నుండి 2025 వరకు తునికాకు బోనస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తునికాకు సమస్యపై గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేసి పోరాట కమిటీలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, ఎండి దావూద్, చిట్టిబాబు, రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు దగ్గి చిరంజీవి, ఆగి రెడ్డి, ప్రవీణ్, రవి, దామోదర్, కృష్ణ బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు*

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -