- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో శాంతి చర్చల ప్రభావంతో దేశంలో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం తర్వాత అరబ్ దేశాల నుంచి ఎగుమతి ఆర్డర్లు భారీగా పెరిగాయి. దీంతో గత రెండు రోజుల్లోనే బియ్యం హోల్సేల్ ధరలు సుమారు 7% పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా ఎగుమతులు మరింత పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 15 రోజుల్లో రిటైల్ మార్కెట్లో కూడా బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
- Advertisement -



