Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Aclure: అక్లూర్ గ్రామ  పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలి…

Aclure: అక్లూర్ గ్రామ  పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలి…

- Advertisement -




నవతెలంగాణ  (వేల్పూర్) ఆర్మూర్  

మండలంలోని అక్లూర్ గ్రామ పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని బిజెపి మండల అధ్యక్షుడు బేల్దారి నవీన్ బుధవారం తెలిపారు. ఇక్కడ ప్లాట్ల భూమి బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమంగా   భూకబ్జా, బాధితులపై దౌర్జన్యం,దాడి  విషయం తెలుసుకొని  గ్రామం వెళ్లి బాధితులను పరామర్శించి అక్కడ జరిగిన విషయాలు తెలుసుకొని బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చినారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ   గత రెండు మూడు రోజుల నుంచి అక్లూరు గ్రామంలో లబ్ధిదారులు పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని సంబంధిత అధికారుల చొరవ తీసుకొని ఇట్టి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు వీళ్లకు 1994లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదా మరి ఎందుకు ఆ పేద ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు అదే ఊరికి చెందిన ఒక బీఆర్ఎస్ నాయకుడు అక్రమంగా పట్టా చేసుకుని లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఇట్టి విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ అతని మందలించాల్సింది పోయి ఆయనకి సపోర్ట్ చేస్తుంది బీసీలను పట్టించుకోవడం లేదనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -