- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ ట్రైలర్ ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్టే కొద్ది సేపటి క్రితం మూవీ 3 నిమాషాల 34 సెకన్ల ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ మూవీ పక్కా హిట్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో ప్రభాస్ పాత్ర డెప్త్, సినిమా హంగులు మరింత బలంగా చూపించారు.
- Advertisement -