నవతెలంగాణ- హైదరాబాద్: పెహల్గామ్ దాడిపై భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) రైతు నేత చౌదరి రాకేష్ తికాయత్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన నిజమైన దోషులు పాకిస్తాన్‌లో లేరు. రక్తపాతం వల్ల లబ్దిపొందుతున్నవారే నిజమైన దోషులు. వారు భారత్‌లోనే ఉన్నారని రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ హింస వల్ల ఎవరు లాభపడుతున్నారు? హిందువులు- ముస్లింలు అని ఎవరు వేరు చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వ్యక్తులలోనే ఉంది అని తికాయత్ వ్యాఖ్యానించారు. ఉదాహరణఖకు ఒక గ్రామంలో హత్య జరిగితే.. ఈ సంఘటన వల్ల ప్రయోజనం పొందే వ్యక్తిని పోలీసులు మొదట అరెస్టు చేస్తారు. అదేవిధంగా ఈ హింస వల్ల ప్రయోజనం పొందుతున్న వారు పాకిస్తాన్‌లో కాదు.. భారత్‌లోనే ఉన్నారు. మరి ఈ హింసవల్ల ఎవరికి లాభం జరుగుతుందో వారిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా, పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వల్ల పర్యాటకులపై తీవ్ర ప్రభావం పడిందని ఈ ఘటనతో సందర్శకులు తగ్గారని తికాయత్ అన్నారు. ఈ దాడి తర్వాత కాశ్మీర్ ప్రజలతో తాను మాట్లాడానని.. ఆ సమయంలో వారంతా నాశనమైందని బాధపడేవారే కానీ.. ఈ దాడి జరగడానికి గల కారణంపైన.. దానికి సంబంధించిన అసలు ప్రశ్నపైన ఎవరు దృష్టి పెట్టడం లేదు అని ఆయన ఆవేదన చెందారు. మూడేళ్ల క్రితం జమ్మూకాశ్మీర్‌లో పండించే యాపిల్స్‌పై నిషేధం విధించారు. 22 రోజులపాటు జాతీయ రహదారులపై ట్రక్కుల్లో యాపిల్ పండ్లు నిలిచిపోయాయి. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రతిరోజూ లెక్కించారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కూడా దాడి తర్వాత శ్రీనగర్‌లో పండ్లను, పర్యాటక ప్రదేశాలను నిలిపివేస్తే.. అవి నాశనమవుతాయి. పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది అని ఆయన అన్నారు. ఇలాంటి దాడుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అందరికీ తెలుసు. కానీ ఎవరు నోరు విప్పడం లేదు అని తికాయత్ వ్యాఖ్యానించారు.
నిజమైన దోషులు పాకిస్తాన్‌లో కాదు.. భారత్‌లోనే ఉన్నారు : రాకేష్ తికాయత్
- Advertisement -