Monday, March 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలురంగారెడ్డి జిల్లాలో కదం తొక్కిన ఎర్రదండు 

రంగారెడ్డి జిల్లాలో కదం తొక్కిన ఎర్రదండు 

- Advertisement -
  • – కలెక్టరేట్ వైపు పేదల అడుగులు
  • – ఇబ్రహీంపట్నం నుండి పాదయాత్ర ప్రారంభం 
    – ప్రభుత్వపై సమర శంఖం పూరించిన సీపీఐ(ఎం)
    – పాదయాత్రను ప్రారంభించిన సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 
  • నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : ప్రజా సమస్యలపై సీపీఐఎం సమర శంఖం పూరించింది. ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ వరకు సాగిన పాదయాత్రకు వేలాది మంది పేదలు తరలివచ్చారు. వారి ప్రతి అడుగు కలెక్టరేట్ వైపు సాగింది. ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాదయాత్రను జండా ఊపి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్ డిపో వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో జాన్ వెస్లీ అగ్ర భాగాన నడిచారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా మీదుగా శేరిగూడ, శ్రీ ఇందు మీదుగా మంగళపల్లి వరకు సాగిన పాదయాత్రలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర జాన్ వెస్లీ పాదయాత్రలో అడుగు వేశారు. ప్రజల్లో ఉత్సాహం నింపారు. వేలాదిగా తరలివచ్చిన పేదలు ఈ పాదయాత్రలో భాగస్వాములు కావడంతో ప్రజా సమస్యల పరిష్కారం కేవలం ఎర్రజెండాకే సాధ్యమని మరోసారి నిరూపించారు. ఈ పాదయాత్రలో మహిళలు, చిన్నారులతో పాటు వృద్ధులు సైతం ఎర్రటి ఎండలు లెక్కచేయకుండా పాదయాత్రలో ముందుకు సాగారు. 
  • జాన్ వెస్లీ ఆరు కిలోమీటర్ల పాదయాత్ర…
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్రకు జాన్ వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి ప్రారంభించిన ఆయన ఇబ్రహీంపట్నం నుంచి మంగళపల్లి చౌరస్తా వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్రలో నడిచారు. ప్రజలకు మద్దతుగా పాదయాత్రలో అడుగు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కరించకపోతే గుణపాఠం తప్పదని ఈ పాదయాత్ర నుండే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 

వయస్సును లెక్క చేయని మహిళలు..
తమ సమస్యలు కేవలం ఎర్రజెండాతోనే సాధ్యమని భావించిన మహిళలు తమ వయస్సును కూడా లెక్కచేయకుండా పాదయాత్రలో భాగస్వాములయ్యారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం, మాడుగుల, ఆమనగల్, మండలాలకు చెందిన పేదలు వేలాదిగా ఈ యాత్రలో తరలివచ్చారు. అత్యధికంగా మహిళలు భాగస్వామ్యం కావడంతో యాత్ర ఉత్సాహంగా సాగింది. 

భగత్ సింగ్ కు ఘన నివాళి.. 
పాదయాత్ర ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకోగానే భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో ఉద్యమాలను ఉతృత్వం చేస్తామని తెలిపారు. ఈ పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ జిల్లా కార్యదర్శి పి యాదయ్య జిల్లా కార్యదర్శి వర్గాల సభ్యులు సామెల్, రామచందర్, జగదీష్, కే జగన్, ఏర్పుల నరసింహతో పాటు జిల్లా కమిటీ సభ్యులు మహిళా సంఘం జిల్లా నాయకత్వం తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -