- Advertisement -
- ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ-భువనగిరి: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్ హుడ్ సెంటర్స్లలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షం ప్రకటించింది. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో ఎంపీ ఆర్డీ జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడారు. వేతనాల పెంపు, హెచ్ ఆర్ పాలసీ అమలు కోసం, రెగ్యులరైజ్ చేయాలని 2024 నుండి ఎన్ టి ఆర్ డి ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహించామన్నారు.
ఎస్‌ఇఆర్‌పీ ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్హుడ్ సెంటర్స్ లలో పని చేస్తున్న కార్యకర్తలు, ఎర్లీ ఇంటర్వెన్షన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్,ఆయా రిహబిలిటేషన్ ప్రొఫెషనల్స్ పని 225 మంది పని చేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో గత 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు.
- Advertisement -