Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేలకొరిగిన వరి.. రైతుల ఆశలు ఆవిరి

నేలకొరిగిన వరి.. రైతుల ఆశలు ఆవిరి

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం 
పంట సాగు చేసేటప్పటినుంచి చేతి కొచ్చే వరకు అన్నదాతకు అన్నీ కష్టాలే. యధాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన రైతు బొగురంపేట పద్మారెడ్డి తనకున్న ఐదు ఎకరం పొలంలో వరిసాగు చేపట్టాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు పంట అంతా ఇలా పొలంలో అడ్డం పడ్డది. వారం రోజుల్లో నూర్పిడి చేసుకుందాం అనుకునే తరుణంలో నేలకొరగడంతో పంటను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని గింజలు నేలరాలాగా, మరికొన్ని మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -