Wednesday, August 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కుంది

వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కుంది

- Advertisement -

– భారత్‌కు హెచ్చరికలు చట్టబద్ధం కావు : ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా
మాస్కో : తనతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను రష్యా తీవ్రంగా ఖండించింది. ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి ఎత్తుగడలు అవలంబించడం చట్టబద్ధం కాదని మండిపడింది. భారత్‌ దిగుమతులపై ఇరవై ఐదు శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్‌ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్‌ ప్రతినిధి డెమెట్రీ పెస్కోవ్‌ గురువారం స్పందిస్తూ ‘మేము అనేక ప్రకటనలు వింటున్నాం.
వాస్తవానికి అవి బెదిరింపులు. రష్యాతో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని వివిధ దేశాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. ఇలాంటి ప్రకటనలు చట్టబద్ధమై నవని మేము భావించడం లేదు’ అని అన్నారు. ‘సార్వభౌమత్వం కలిగిన దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉన్నదని మేము విశ్వసిస్తున్నాము. ఆ హక్కు ఉండాలి కూడా. వాణిజ్య, ఆర్థిక సహకారం కోసం భాగస్వాములను ఎంచుకునే హక్కు వాటికి ఉంటుంది. తమ దేశ ప్రయోజనాల కోసం ఏ విధంగా వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని పొందాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు కూడా వాటికి ఉంటుంది’ అని పెస్కోవ్‌ తెలిపారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై జరిమానా విధిస్తానం టూ ట్రంప్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో క్రెమ్లిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ట్రంప్‌ హెచ్చరికలు సమర్ధనీయం కావని భారత్‌ స్పష్టం చేసింది. తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నానని తెలిపింది. అవసరాల రీత్యా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామని, దేశీయ వినియోగ దారులకు అందుబాటు ధరలో చమురు లభించేలా చూస్తున్నామని విదేశాంగ శాఖ వివరిం చింది. ‘రష్యా నుంచి మేము చమురును దిగుమతి చేసుకుంటున్నామంటూ ఉక్రెయిన్‌ ఘర్షణల తర్వా త అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ విమ ర్శిస్తున్నాయి. వాస్తవానికి ఘర్షణలు ప్రారంభమైన తర్వాత సంప్రదాయ సరఫరాలు యూరప్‌కు మళ్లినందునే మేము రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాము. ఆ సమయంలో అమెరికా కూడా మమ్మల్ని ప్రోత్సహించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ సుస్థిరత బలోపేతం అవుతుందని చెప్పింది’ అని గుర్తు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -