నవంబర్ 20, 21, 22 న ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పిలుపు
ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల లోగో ఆవిష్కర
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నేటి విద్యార్దులే రేపటి దేశ భవిష్యత్ అని, దేశ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి అని, వారి పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని, నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం ఛైర్మన్ పి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల సుభాష్ నగర్ లోని బోధన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల లోగోను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఈ సందర్భంగా మాజీ మంత్రి ,ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధన విద్యాని, ఆ విద్య ద్వారానే దేశ అభివృద్ధికి బాటలు వేయవచ్చని దీనికి సాధకులు విద్యార్ధులని, దేశ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలని అన్నారు.నేడు సమాజంలో జరుగుతున్న మార్పులను విద్యార్థులు గమనించాలని విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి, అన్యాయాలపై ఉద్యమించాలని, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ పోరాటాలు అభినందనీయమని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, మహాసభల ఆహ్వాన సంఘం ఛైర్మన్ పి. సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగేష్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పి.సుధాకర్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షుడు వర్ధపట్టు వేణు రాజ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, జిల్లా కార్యదర్శి రఘురాం,జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభొద్ పాల్గొన్నారు.