- Advertisement -
- – ఇల్లు కట్టించడం ప్రభుత్వ బాధ్యత. .
– యుద్ధం పరిష్కార మార్గం కాదు..
– దేశభక్తి అంటే ప్రజల భక్తి. .
– సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. .
– పార్టీలో శుభ రక్తాన్ని నింపాలి. .
– కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య. .
– జేబులు నింపుకునే పథకాలకి ప్రాధాన్యత. .
– కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ..
నవ తెలంగాణ – భువనగిరి - దేశంలో రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వ విద్యను ప్రభుత్వ వైద్యాన్ని ధ్వంసం చేశారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధరైతంగా విప్లవ పోరాట యోధులు, దక్షిణ భారతదేశ సీపీఐ(ఎం) నిర్మాణంలో ప్రముఖులు పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని పురస్కరించుకొని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
- అనంతరం ఎంతో అట్టహాసంగా నిర్వహించిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాల సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం విద్యా విధానం ప్రభుత్వం చేతిలో నుండి జారిపోయిందన్నారు. నర్సరీ చదివే బిడ్డకు రెండు లక్షలు, వాహన ఫీజు రూ50వేలు దాకా పెరిగింది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, వసతి గృహాలు, మౌలిక సదుపాయాల కల్పించడంలో పాలక పక్షాలు ప్రైవేట్ వ్యక్తులకు దాసోహమై విఫలమవుతున్నారన్నారు. ప్రజల కోసం నాటి విద్యా విధానం ఉంటే, ప్రైవేటు పెట్టుబడిదారుల కోసం నేటి విద్యా విధానం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వము విద్య వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. చైనా, వియత్నం విద్యా ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. 1971 దశకంలో వియత్నం నేలమట్టమైన ప్రతి గ్రామంలో కందకాలు తొవ్వి విద్యకు ఆటంకం కాకుండా విద్యను బోధించారన్నారు.
- పాలకులు బుద్దిపూర్వకంగానే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేశారన్నారు. నేటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పోరేట్ విద్య లో సుమారు 20 నుండి 30 శాతం వరకు తమ పెట్టుబడును పెడుతున్నారని తెలిపారు. పాతతరం ప్రజా పాలకులు ఈ విధంగా లేరని తెలిపారు. విద్యా విధానంతో పాటు వైద్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఒకప్పుడు నిమ్స్ వైద్యశాలలో బెడ్లు దొరకకపోయేవి అన్నారు. ఇటీవల హస్పటల్ సందర్శించినప్పుడు 700 బెడ్లుంటే 200 పేషంట్లు మాత్రమే ఉన్నారన్నారు. నిమ్స్ కు ఎవరైనా వస్తే గాంధీ వైద్యశాలకు పోమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజలు ప్రైవేటు వైద్యంపై ఆధారపడే విధంగా పాలకుల విధానాలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు పూతమిస్తున్నారని తెలిపారు. వైద్యం అనేది ప్రజల హక్కుగా ఉండాలన్నారు. ప్రభుత్వమే ప్రజలకు వైద్యము పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలన్నారు. గతంలో కమ్యూనిస్టులు వైద్యం శాస్త్రీయంగా నేర్చుకొని గర్భిణీలకు పురుడు పోసారన్నారు. కమ్యూనిస్టు నేతైన పుచ్చలపల్లి సుందరయ్య వైద్యం నేర్చుకుని ఎందరికో పురుడు పోసారన్నారు. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత ముఖ్యమని నేడు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ముసలితనం వస్తే భయపడే పరిస్థితి నేడు సమాజంలో ఉందన్నారు. ఇంటింటికి గ్యాస్, ఇంటింటికి విద్యుత్తు, ఇంటింటికి నీరు సౌకర్యం అనే ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, ఇల్లే లేని వారికి ఇవన్నీ చేసుకొని ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. ఇండ్ల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. విదేశాల్లో మాదిరిగా ప్రజలకు మన దేశంలో ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే కామన్ హౌస్ లు నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి భూమి, బుక్తి కొరకు, వెట్టి చాకిరి విముక్తి కోసం చేసిన సేవలు వారు చేసిన పోరాటాలు త్యాగాలను జ్ఞాపకం పెట్టుకొని భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. ఉగ్రవాదులు పహాల్గం దాడిలో 28 మందిని పొట్టన పెట్టుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వము సింధూరి పేరిట ఉగ్రవాద 9 కేంద్రాలను ధ్వంసం చేసింది అన్నారు. ఉగ్రవాదం పుట్టడానికి, స్థానిక ప్రజల మద్దతు ఇవ్వడానికి కారణం తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాశ్మీర్ ప్రజలు కొందరు ఉగ్రవాదులకు సహాయం చేసే స్థితి నుండి చెయ్యని స్థితికి తీసుకురావాలన్నారు. భారతదేశ చాలా యుద్ధాలు చేసింది అన్నారు మనతో పాటు ఇతర దేశాలు యుద్ధం చేసిన పరిష్కారం లభించలేదన్నారు. యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావని చెప్తే కమ్యూనిస్టులను దేశద్రోహులని ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటివారు అంటున్నారని తెలిపారు. 1965 లో సుందరయ్యను జైల్లో పెట్టారన్నారు ఇప్పటికీ ఎప్పటికీ యుద్ధం పరిష్కారం కాదన్నారు. ఓట్ల కోసం, పదవీ కాంక్ష కోసం యుద్ధం చేయడం కాదని, దేశ రక్షణ కోసం యుద్ధం చేయాలన్నారు. ప్రస్తుతం పాలక ప్రభుత్వం మన దేశంలో పాకిస్తాన్ చేసిన దురాగతలను వివరించడానికి తన ఎంపీలతో పాటు కాంగ్రెస్లోని ఎంపీలను వారే ఎంపిక చేస్తున్నారన్నారు, ఇది పార్టీ విభజన, అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికి చీల్చడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కమ్యూనిస్టు భాషలో దేశభక్తి అంటే ప్రజల భక్తి అని దేశ రక్షణ అని రాఘవులు పేర్కొన్నారు. దేశం కోసం ప్రజల కోసం పనిచేయడమే కమ్యూనిస్టుల దేశభక్తి అని తెలిపారు అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా మన పని విధానం ఉండాలన్నారు.
- కమ్యూనిస్టులు నిబద్ధతతో మరింతగా ప్రజల మధ్య ఎప్పుడూ ఉండాలని కోరారు. .
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ పోరాటం గురించి సుందరయ్య చేసిన త్యాగం గురించి నేటికీ ప్రజలు స్మరించుకుంటున్నారని తెలిపారు గతం గురించి చెప్పుకోవడం సులభమని పుచ్చలపల్లి సుందరయ్య మల్లు స్వరాజ్యం లాంటి ఎందరో యోధుల త్యాగాలను ఆచరణలో పెట్టడమే కష్టమని అందుకు యువ కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు నేటికీ సమాజంలో ప్రజలు ఎర్రజెండాను కోరుకుంటున్నారని తెలిపారు మనము కావాల్సినంత దగ్గరికి కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. సుందరయ్యను ప్రజలు ఎలా కాపాడుకున్నారో వివరించారు. ప్రజల కోసం పనిచేస్తూ వారిని చైతన్యవంతం కమ్యూనిస్టులను గెలిపిస్తారని తెలిపారు. మూసి శుద్ధి చేయాలని కమ్యూనిస్టులు కోరుతున్నారని తెలిపారు గోదావరి కృష్ణా జలాలతో మంచినీరు సాగునీరు అందించాలన్నారు రియల్ ఎస్టేట్ లతో డబ్బులు సంపాదించాలని కాంట్రాక్టుల ప్రయోజనం కోసం పాలకవర్గాలు పనిచేస్తున్నాయన్నారు అమరవీరుల కుటుంబాలతో ఆత్మీయ సభ నడపడం సంతోషకరమన్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిదాయకమన్నారు. కమ్యూనిస్టులను ఈ జిల్లాలో ఎలా ఆదరించి గెలిపించారో కుమ్మాయిగూడం మునిపంపుల గ్రామాల ప్రజల త్యాగాన్ని గుర్తు చేశారు భవిష్యత్తు మనదేనా అని పేర్కొన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలన్నారు ప్రతిజ్ఞ చేయాలన్నారు పార్టీ నిర్మాణం పై దృష్టి సారించాలన్నారు అక్జలరీ శాఖలు వేయాలన్నారు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు చీకటికి వ్యతిరేకంగా తమ పోరాడమని దాశరధి పేర్కొన్నట్లు తెలిపారు. కుల మత ప్రాంత ప్రయోజనాల తో కూడిన రాజకీయాలు వస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా కటిక చీకటి వ్యతిరేక పోరాటాలు నిర్వహించాలని దాశరధి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగం చెప్పిన హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. జేబులు నింపుకునే పథకాలు తీసుకు వస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు పాత బకాయిలను అడుగుతే దుర్మార్గమైన ఆలోచనలతో కొంతమంది లేని ప్రశ్నలను వేస్తున్న రేవంత్ రెడ్డి తీరును మార్చుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డిలు ప్రసంగించారు. 45 మంది అమరవీరుల కుటుంబాలకు శాలువా కప్పి జ్ఞాపికలను అందజేశారు. ప్రజానాట్యమండలి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, గుండేటి శ్రీనివాస్ చారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొల్లు యాదగిరి, ఎండి పాషా, గడ్డం వెంకటేష్, ముత్యాలు, మద్దెల రాజయ్య, దయ్యాల నరసింహ, బోలగాని జయరాములు, సిరిపంగ స్వామి, ముద్దాపురం రాజు, బోడ యాదిరెడ్డి, మల్లపల్లి లలిత పాల్గొన్నారు.

- Advertisement -