- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ.. రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడ్ ఆఫ్ హౌజ్‌ను పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, అఖిలపక్ష నేతలు కోరనున్నారు. ఈరోజు ఉదయం 11.30గంటలకు గవర్నర్‌ను కలవబోయే వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పలువురు బీసీ ఎమ్మెల్యేలు, అఖిలపక్ష నేతలు ఉన్నారు.
- Advertisement -