Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో కొనసాగుతున్న రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి శ్రీవారిని దర్శించుకునేందుకు 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం అయ్యేందుకు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (సోమవారం) 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 26,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ధన, వస్తురూపేణ సమర్పించిన కానుకల విలువ రూ.4.41 కోట్లు ఉంటుందని టీటీడీ వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -