- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తలనీలాలు ఇచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు. నిన్న స్వామివారిని 73,677 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 24,732 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు వచ్చాయని వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని.. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తెలిపారు.
- Advertisement -


