- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయితే, టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
- Advertisement -



