Thursday, October 30, 2025
E-PAPER
Homeకరీంనగర్పోలీస్ అమరుల త్యాగం అజరామం

పోలీస్ అమరుల త్యాగం అజరామం

- Advertisement -

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

*పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా కేంద్రంలో క్రొవ్వొత్తుల ర్యాలీ
నవ తెలంగాణ రాజన్న సిరిసిల్ల
పోలీస్ అమరుల త్యాగం అజరామం అని జిల్లా ఎస్ పీ మహేష్ బిగితే పేర్కొన్నారు సిరిసిల్లలోని
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా వారిని స్మరిస్తూ జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని,వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందని,ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవలు నిర్వహిస్తున్నమని అందులో భాగంగా ఈ సంవత్సరం వారిని స్మరిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సైకిల్ ,2కె రన్, వ్యాసరచన పోటీలు,షార్ట్ ఫిలిమ్స్,ఓపెన్ హౌస్ కార్యక్రమలు నిర్వహించామన్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
ఈకార్యక్రమంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ,అదనపు ఎస్పీ చంద్రయ్య,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ,మొగిలి,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి,మధుకర్, ఎస్.ఐలు,ఆర్.ఎస్.ఐ లు,పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.
……

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -