Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుఆడపిల్లల భద్రతే షీటీం బాధ్యత

ఆడపిల్లల భద్రతే షీటీం బాధ్యత

- Advertisement -
  • షిటీం ఇన్‌చార్జ్‌ పార్వతి
    నవతెలంగాణ-పెద్ద కొడప్‌గల్: మండలంలోని కాటేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు బాన్సువాడ షీ టీం ఇన్చార్జ్ పార్వతి మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ కలిసివిద్యార్థులకు షిటీం పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్‌ఐ అరుణ్ కుమార్ సూచన మేరకు పోలీస్ కళ బృందంచే పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.మహిళలు బాలికల భద్రతే షీ టీమ్స్ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100, 181 కు సమాచారం ఇవ్వాలన్నారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురి కాకూడదన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనతో చదువుకొని ఉన్నత స్థాయి కి వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాల న్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇంఛార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు, వాసవి,అనిల్ కుమార్,మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -