Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గండి..

నాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గండి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నాగార్జునసాగర్‌ కుడికాలువ కట్టకు గురువారం అర్ధరాత్రి గండి పడింది. ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద కట్టకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది. దీంతో వాగు పరీవాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులేటి వాగు ఆనుకొని వీరుల తిరునాళ్ల నేపథ్యంలో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోని మూడు దుకాణాలు లోతట్టులో ఉండటంతో నీరు చేరింది. మరో వైపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నెస్పీ అధికారులు వెంటనే యంత్రాల సాయంతో అక్కడకు చేరుకుని గండి పూడ్చే పనులు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -