– చివరి 43 మీటర్ల భాగంలో కంచె
– డేంజర్ జోన్‌గా ప్రకటించిన రెస్క్యూ టీం
– ఆ ఎనిమిది కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమందజేత
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీ ఇప్పట్లో తెలిసేలా లేదు. మంత్రి ఉత్తమ్ కుమార ్‌రెడ్డి చెప్పిన దాన్నిబట్టి వారి మృతదేహాల వెలికితీత ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టు అర్థమవు తోంది. టన్నెట్‌లో కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం అత్యంత ప్రమాదకరమని తెలిసినా.. వారి ఆచూకీ కోసం ప్రాణాలకు తెగించి రెస్క్యూ టీం రెండు నెలలపాటు నిర్విరామంగా కృషి చేసింది. మైనింగ్, ఆర్మీ, హైడ్రాతో పాటు 12 శాఖలకు సంబంధించి సహాయక చర్యలు చేప ట్టారు. ప్రమాద ప్రాంతంలో రోబోలను ఉపయో గించారు. కేరళ కడావర్ డాగ్స్‌ను రప్పించారు. చిన్న యంత్రాలతో పనులు చేశారు. ఎన్ని ప్రయ త్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెండు నెలల కాలంలో ఇద్దరు ఇంజినీర్ల మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. ఇంకా ఆరుగురి ఆచూకీ తెలియలేదు. సహాయక పనులు ముందుకు సాగ డంలేదు. ఉబికి వస్తున్న నీరు, మట్టి తీవ్రతతో ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది. చివరకు టీబీఎం కు ముందు భాగాన ఉన్న 43 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అక్కడ పనిచేసే వారు రిస్క్‌లో పడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలి పారు. దాంతో చివరి ప్రాంతంలో ఇప్పట్లో పనులు చేయడానికి వీలు కాదని ఇనుప కంచె వేశారు.
మృతదేహాలు బయటపడిన ఇద్దరు ఇంజినీర్ల కుటుంబాలతోపాటు మిగతా ఆరు కుటుంబాలకు కూడా ప్రభుత్వం రూ.25లక్షల చొప్పున అందజే సింది. కార్మికుల కుటుంబాలు తమ బిడ్డల ఆచూకీ చూపాలని అడుగుతుంటే ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చేతిలో పెట్టింది. అంటే ఇక ఎస్‌ఎల్‌బీసీలో ఇరుక్కున కార్మికుల కథ ముగిసిట్లేనని తెలుస్తోంది. హై టెక్నాలజీని ఉపయోగించి కార్మికులను బయటకు తెస్తామని మంత్రి ఉత్తమ్ చెబుతున్నా.. ఇప్పట్లో అది జరిగే పని కాదని తెలుస్తోంది. సొరంగం చివరి 43 మీటర్ల ప్రాంతంలో పనులను నిషేధించారు. అక్కడ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పైనుంచి వస్తున్న నీరు, మట్టి కూలి ప్రమా దకరంగా మారింది. అందుకే ఇక హైటెక్నాలజీని వాడతామని మంత్రి చెప్పారు. కానీ ఎప్పటిలోగా తిరిగి పనులు పునరుద్ధరణ చేస్తారో చెప్పడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ దోమలపెంట దగ్గర పనులు ఇలా ఉంటే.. మన్నెవారిపల్లిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ టీబీఎం మిషన్ చెడిపోయింది. దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఇక్కడి నుంచి కూడా పనులు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రమాదాలను నివారించాలి : సూర్యప్రతాప్‌గౌడ్, మాజీ ఎంపీపీ, పెద్దకొత్తపల్లి
ప్రాజెక్టులలో తరచుగా ప్రమా దాలు జరుగుతున్నాయి. ఎంతో మంది కార్మికులు చనిపోతున్నారు. నిర్మాణ సమయంలో సరైన జాగ్ర త్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగు తున్నాయి. ముఖ్యంగా కంపెనీలు పనుల ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలి.
టన్నెట్‌లో కార్మికుల ఆచూకీ ప్రయత్నాలు ముగిసినట్టే..
- Advertisement -
RELATED ARTICLES