– యుక్తవయస్సు లోనే సరైన మార్గం ఎన్నుకోవాలి
– ఇన్స్పైర్ – ఇగ్నైట్ లో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట : బాల్యానికి యవ్వనానికి మద్య ఉండేదే యుక్త వయస్సు అని,ఈ సమయంలోనే భవిష్యత్ లక్ష్యానికి సరైన మార్గం ఎంచుకునే అవకాశం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. స్థానిక వీకేడీవీఎస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వ్యక్తిత్వం వికాసం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు.
నేటి బాలలే రేపటి పౌరులు అని అందుకోసం మే నేను విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు.పదో తరగతి,ఇంటర్ చదివే సమయంలో విద్యార్ధులకు కీలకమైన దశ అని అన్నారు.ఈ సమయంలో లక్ష్యం నిర్దేశించుకున్న వారే విజయావకాశాలు సాధించి జీవితంలో స్థిర పడతారని తెలిపారు.
నియోజక వర్గంలో ప్రతీ ఉన్నత పాఠశాల,జూనియర్ కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసం నిర్వహిస్తాం అని ఇప్పటికే 30 పాఠశాలల్లో పూర్తి చేసామని,మరో 40 పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేషుబాబు,సీఐ నాగరాజు రెడ్డి,పీఏసీఎస్ అద్యక్షులు సత్యనారాయణ,నాయకులు తుమ్మ రాంబాబు,ప్రమోద్ లు పాల్గొన్నారు.