– రైతు వేదిక ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ-ఊట్కూర్
గన్నీ బ్యాగుల కొరతను తీర్చాలని కోరుతూ రైతు వేదిక ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పెద్దజట్రం క్లస్టర్ పరిధిలో అవుసలోపల్లి, పెద్ద జట్రం, బిజ్వార్ గ్రామాలు ఉన్నాయి. ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. దీంతో రైతు వేదిక ముందు బైటాయించి నిరసన తెలిపారు. రైతులకు టోకెన్లు ఇచ్చి సకాలంలో గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై పీఏసీఎస్ ఇన్‌చార్జి విద్యాసాగర్‌ను ‘నవతెలంగాణ’ వివరణ కోరగా.. రైతులకు గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES