- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.
- Advertisement -



