Saturday, May 3, 2025
Homeసినిమా'హృదయం లోపల..' పాటకి ఊహించిన దానికంటే భారీ స్పందన

‘హృదయం లోపల..’ పాటకి ఊహించిన దానికంటే భారీ స్పందన

‘కింగ్‌డమ్‌’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘హృదయం లోపల’ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురు చూసేలా ఉంది. తాజాగా శుక్రవారం ‘హదయం లోపల’ పూర్తి గీతం విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది అని మేకర్స్‌ తెలిపారు.
అనిరుధ్‌ రవిచందర్‌ తన మనోహరమైన సంగీతంతో ఈ పాటను అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్‌తో కలిసి అనిరుధ్‌ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. వీరి మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్‌ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దశ్యరూపం ఇచ్చారు. ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌కి కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా తన భావాలను పంచుకున్నారు. ”3′ ‘విఐపి’ చిత్రాల సమయంలోనే అనిరుధ్‌ సంగీతానికి అభిమానిని అయిపోయాను. నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. విజరు దేవరకొండ, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్‌ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ పాట ఉంది. కథ లోతును తెలియజేస్తూ.. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకరా స్టూడియోస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img