- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పులికాట్ సరస్సులో వందల సంఖ్యలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగుల ఈకలతో ఆకట్టుకునే పెయింటెడ్ స్టార్క్‌లు పోటీ పడుతూ చేపలను వేటాడుతున్నాయి. స్థానికులు ఎర్రకాళ్ల కొంగలు అని పిలిచే ఈ పక్షులు ఏటా ఇదే సీజన్‌లో సరస్సులో కనువిందు చేస్తుంటాయి. ఈ సారి దొరవారిసత్రం వద్ద నేలపట్టులో చెట్లపై పెద్దఎత్తున గూళ్లు పెట్టుకున్నాయి. గుంపులుగా చేపలను వేటాడుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
- Advertisement -



