నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో ఇరాన్ లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. విరామం లేకుండా ఆ దేశ భూభాగాలపై బాంబులు వేస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల ఉపరితలం నుంచి ఇజ్రాయిల్, అమెరికా వైమానికి దాడులతో పాటు క్షిపణుల దాడులు చేస్తోంది. దీంతో గల్ప్ దేశాల్లో ప్రచ్చన్న యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అదే విధంగా ఇజ్రాయిల్ కూడా ప్రతీకార దాడులతో పాటు ఆయా దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. అప్రమత్తమైన గల్ఫ్ దేశాలు ముందస్తుగా పలు కీలక చర్యలు తీసుకున్నాయి. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనధికారంగా తమ దేశాల భూభాగాల గుండా దాడులకు పాల్పడ్డం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దమని గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. తాజాగా గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, వాటి భూభాగం ద్వారా వైమానిక దాడులు జరగడం సమంజసం కాదని బీజింగ్ ఓ ప్రకటనంలో పేర్కొంది.
“ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల గురించి చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది, ఇది ఇరాన్ పొరుగు దేశాలపై ప్రభావం చూపింది. గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కూడా పూర్తిగా గౌరవించాలని చైనా విశ్వసిస్తోంది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.



