– ఉత్సాహంగా పాల్గొన్న ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గం
నవతెలంగాణ – ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంతో సహా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉగాది శోభ సంతరించుకుంది. పంచాంగ శ్రవణానందం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరాని కంటే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నట్లంది. మండల వ్యాప్తంగా నూతన సర్పంచులు పాలకవర్గం తో కళకళలాడింది. మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి- రాజు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ దుస్తులతో దేవాలయాలలో గ్రామపంచాయతీ ఆవరణలో షడ్రుచుల పచ్చడి గ్రామ ప్రముఖులకు కార్యకర్తలకు ఉగాది పచ్చడి అందిజేసి.. ” పరాభవ ” తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకల్లో ఉప సర్పంచ్ భాష బోయిన పైడి ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి ,వార్డు సభ్యులు తనుగుల సందీప్, గుర్రం శ్రీకాంత్, జక్కుల ఉమా, గంటా రాహుల్ రెడ్డి, భయ్యా కుమారస్వామి, సంగె మహేందర్ ,చిమ్మని దేవరాజ్ , చిన్ని ,బొల్లె స్వ శ్యామ్, పాత్రికేయులు పోలు రాజేష్ కుమార్, పాల్గొన్నారు . మండలంలోని పెంచికలపేట గ్రామ సర్పంచ్ మందపల్లి మరియా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. , పెద్దాపురం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎలుకటి రవి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, కాంగ్రెస్ సమన్వయ సభ్యులు కక్కర్ల రాజు, ఉపసర్పంచ్ జిల్లపల్లి కుమార్ లు పాల్గొన్నారు . అలాగే మండలంలోని కటాక్ష పూర్ , హౌజుబుజుర్గు, నీరుకుళ్ళ, లింగ మడుగుపల్లి ,నాగయ్య పల్లి ,ఆగ్రంపహాడ్, కొత్తగట్టు ,గుడెప్పాడ్ ,మల్కపేట, అక్కంపేట గ్రామాల్లో సర్పంచులు పాలకవర్గం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణానందం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు.
మండల వ్యాప్తంగా ఉగాది శోభ, పంచాంగ శ్రవణానందం”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



