హీరో సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ అనే చిత్రంతో అందరి హదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘ఇదొక బ్యూటీఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకు కావాలసిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్ అందర్ని అలరిస్తుంది. ఇదొక క్యూట్ అండ్ ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీలా సినిమాలోని ప్రతి ఫేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. సుహాస్ ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్‌గా సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు’ అని అన్నారు.