Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచ చ‌రిత్ర‌లో ‘తెలంగాణ’ గొప్పది: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రపంచ చ‌రిత్ర‌లో ‘తెలంగాణ’ గొప్పది: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ–హైదరాబాద్‌: ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం, రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది. ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా పని చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సామాజిక న్యాయం, ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ లక్ష్యం.

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. మహిళలకు పెద్ద పీట వేస్తూ కోటి మందిని కోటీశ్వరులను చేయబోతున్నాం. మహిళల అభివృద్ధికి అండదండలు అందిస్తాం. స్వేచ్చ, సమానత్వంలో తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉంది. ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు అందుకోవడానికి విద్య ఒక్కటే మార్గం. భవిష్యత్‌ తెలంగాణ కోసం విద్యపై భారీగా పెట్టుబడి పెడుతున్నాం. విద్యతో పాటు క్రీడలకు అ‍త్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి తొలగించాలి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్దత కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజికన్యాయ సాధన ప్రక్రియకు మీరు అడ్డుపడొద్దు. కృష్ణా, గోదావరి నీటి వాటాల విషయంలో రాజీపడటం లేదు. మన వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -