- Advertisement -
- మండల టాపర్ గా నిలిచిన జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ పాఠశాల
- ఫలించిన ప్రధానోపాధ్యాయిని వ్యూహం
- ప్రధానోపాధ్యాయులు బోనాల సుధాకర్
- అభినందించిన ప్రముఖులు
నవతెలంగాణ -తాడ్వాయి: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కాటాపూర్ జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జెడ్పిహెచ్ఎస్ కాటాపూర్ పాఠశాల విద్యార్థిని కాట స్వేత మొత్తం 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించి మండలంలో టాపర్ గా, జిల్లాలోనే మూడవ స్థానంలో నిలిచారు. ఎస్.కె నిజాముద్దీన్ 548 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. గండు దీక్షిత 538 మార్కులు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. కాటాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 550- 500 మార్కులు సాధించిన విద్యార్థులు ఆరుగురు, మొత్తం 29 మంది విద్యార్థుల్లో 28 మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఒకరు ద్వితీయ శ్రేణిలో పాస్ అయి కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల 100% రిజల్ట్ సాధించి, మండల టాపర్ గా నిలిచింది. ములుగు జిల్లా లో మూడో స్థానంలో నిలిచింది. జడ్.పి.హెచ్.ఎస్, కాటాపూర్ ప్రధానోపాధ్యాయులు బోనాల సుధాకర్ వ్యూహం విజయం సాధించింది. జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు లు సూచనల మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులను చదువుతూ పాటు క్రీడా అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేశారు. కృషికి ఫలితంగా కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల మండల టాప్ గా నిలిచినందుకు జిల్లా విద్యాశాఖ, వివిధ శాఖ అధికారులు, మండల జిల్లా ప్రముఖులు మేధావులు అభినందించారు. కాగా తాడ్వాయి మండల వ్యాప్తంగా 4 ఆశ్రమ పాఠశాలలు, 4 జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలు, ఒకటి కేజీబీవీ పాఠశాల మొత్తం 298 విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో పరీక్ష రాయగా 297 మంది విద్యార్థులు పాసై జిల్లాలో అత్యున్నత స్థానం సాధించారు. ఇందిరానగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఒక్క విద్యార్థి మాత్రమే ఫీల్ అయ్యాడు. మండల విద్యాశాఖ అధికారి రేగా కేశవరావు మండలంలోని అన్ని పాఠశాలలో సందర్శిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇచ్చేవారు. ఆయన నిరంతర కృషి వల్లనే మండలం జిల్లాలోనే అత్యంత స్థానంలో నిలిచిందని జిల్లా మండల మేధావులు అభినందించారు.
- Advertisement -