Monday, July 7, 2025
E-PAPER
Homeక్రైమ్గంజాయికి అలవాటు పడి.. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా..

గంజాయికి అలవాటు పడి.. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా..

- Advertisement -

– దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లు
– 17 తులాల బంగారం, 79 తులాల వెండి, రూ.50 వేల విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

చెడు వ్యసనాలకు అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయించడంతో పాటు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్‌ బాలురు, ఒక నిందితుడు, వారికి సహకరిస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 17 తులాల బంగారం, 79 తులాల వెండి, 2 కిలోల గంజాయితో పాటు పల్సర్‌ ఎన్‌ఎస్‌ -200 బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలోని రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ గాలి యాదయ్య ఇంట్లో జూన్‌ 30న జరిగిన దొంగతనంలో 22 తులాల బంగారం, 80 తులాల వెండి చోరీకి గురైనట్టు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నార్కట్‌పల్లి , సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 5.00 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు నార్కట్‌పల్లి గ్రామ శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ పక్కన వెంచర్‌లో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం అందింది. ఈ మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ డి.క్రాంతికుమార్‌, వారి సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా.. హైదరాబాద్‌కు చెందిన 14, 16 ఏండ్లు ఉన్న ఇద్దరు మైనర్లయిన బాజపల్లి జోసెఫ్‌, బోస్‌తో పాటు మహిళ ఎరిక్‌ విల్సన్‌ మెరీనా, మరో నిందితుడు మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. వీరు దొంగతనాలు చేస్తుండటంతో జవహార్‌నగర్‌, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వీరి వద్ద కత్తి, బల్లెం వంటి మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసును చేధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -