Sunday, May 18, 2025
Homeసినిమాథ్రిల్‌ చేసే 'భైరవం'

థ్రిల్‌ చేసే ‘భైరవం’

- Advertisement -

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ హీరోలుగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భైరవం’. విజరు కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ అధినేత డా. జయంతిలాల్‌ గడా సమర్పించారు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్‌, ఆనంది, దివ్యా పిళ్ళై నటించారు. ఈనెల 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ విజరు కనకమేడల మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘గరుడన్‌’ కథని రీమేక్‌ చేయడానికి కారణం ఆ కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్‌ చేసే ఛాన్స్‌ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్‌ ఎమోషన్‌ ఇందులో ఉంటుంది. క్యారెక్టరైజేషన్‌ ప్రజెంటేషన్‌ నా స్టైల్‌లో ఉంటుంది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్‌ వ్యాల్యూస్‌ అన్నీ ఉంటాయి. ఒరిజినల్‌ చూసిన వారు కూడా డెఫినెట్‌గా కొత్తగా ఉందని ఫీల్‌ అవుతారు. ఆడియన్స్‌ కచ్చితంగా థ్రిల్‌ ఫీలౌతారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మనోజ్‌ మంచుతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీతో అతిథి శంకర్‌ చేసిన సినిమా చూశాను. పెర్ఫామెన్స్‌ నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా సాయి శ్రీనివాస్‌తో తనకి చాలా మంచి కెమిస్ట్రీ ఉంటుంది. తన క్యారెక్టర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా చేసింది.
నా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం జారు ఫుల్‌గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మధ్య జరుగుతున్న డ్రామా. ఇందులో ఎంటర్టైన్మెంట్‌ ఎంత కావాలో అంతే పెట్టాం. ముగ్గురి క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయి. శ్రీ చరణ్‌తో నాకు ఇది రెండో సినిమా. తను చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. ఇప్పటికే పాటలన్ని హిట్‌ అయ్యాయి. నా కెరీర్‌లో ది బెస్ట్‌ సినిమాగా ‘భైరవం’ నిలుస్తుందనే నమ్మకం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -