నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు సమయం ఆసన్నమైతుంది. ఈనెల ఫిబ్రవరి 21న సూపర్-8 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. దీంతో టైటిల్ పోరు కోసం సమజ్జీవుల జట్ల మధ్య రసవత్తర పోరు సాగనుంది. అయితే టైటిల్ ఫేవరెట్ జట్లుగా పేరుపొందిన పలు టీంలు సూపర్-8కి దూరం కానున్నాయి. పాక్, ఆస్ట్రేలియా టీంల సూపర్-8కు ఆశలు సందిగ్ధంలో ఉన్నాయి. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న ఇండియా, శ్రీలంక దర్జాగా సూపర్-8బెర్తులను ఖాయం చేసుకున్నాయి.
గ్రూప్-ఏ పరంగా ఇండియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖాయం చేసుకుంది. నాలుగు పాయింట్లతో యూఎస్ఏ రెండో స్థానంలో ఉంది. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన యూఎస్ఏ రెండు గెలిచి, మరో రెండు ఓడిపోయింది. దీంతో యూఎస్ఏ సూపర్-8ఆశలు సజీవంగా ఉన్నాయి. కాకపోతే నమీబియాపై పాక్ టీం ఓడిపోతే యూఎస్ఏ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. లేదంటే పాక్ టీం సూపర్-8కు వెళ్లనుంది.
గ్రూప్-బి పరంగా టోర్ని రెండో ఆతిథ్య జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించి నేరుగా సూపర్-8కి వెళ్లింది శ్రీలంక. ఇంకా గ్రూప్ దశలో ఒక మ్యాచ్ ఆడాల్సింది. అయితే నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే .. తాజాగా నేడు ఓమన్ టీంపై విక్టరీ సాధిస్తే..జింబాబ్వే జట్టుకు సూపర్-8 బెర్తు ఖరారుకానుంది. లేకపోతే ఆసీస్ సూపర్-8కు వెళ్లనుంది.
గ్రూప్-సిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వెస్ట్ండిస్, ఇంగ్లాండ్ సూపర్-8కు వెళ్లాయి. కాకపోతే బ్రిటన్, స్కాట్లాండ్ మధ్య సూపర్-8 కోసం పోటీ నెలకొన్న..ఇటలీపై ఇంగ్లాండ్ విక్టరీ సాధించడంతో స్కాట్లాండ్ సూపర్-8 ఆశలు గల్లంతు అయ్యాయి.
గ్రూప్-డిలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించాయి. అయితే ఆప్ఘనిస్థాన్ టీం వీరోచిత పోరాటం చేసినా..దక్షిణాఫ్రికాపై రెండో సూపర్ ఓవర్లో రషిద్ సేన ఓడిపోయింది. సూపర్-8 ఆటలతో క్రికెట్ అభిమానులకు అసలైన కిక్కు లభించనుంది. టైటిల్ కోసం బలమైన జట్లు ఆటలో ఆమీ తుమీ తెల్చుకోనున్నాయి.



