నవతెలంగాణ – హైదరాబాద్: అలుపు ఎరగని ధీరుడు. భయం అంటే తెలియదు. ఒత్తిడి లెక్క చేయడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ వేస్తాడు. ఎంతటి కఠినమైన వాతావరణం లోనైనా బంతిని వేగంగా విసురుతాడు. తన వల్ల కాదు.. తనకు ఆరోగ్యం బాగోలేదని ఏమాత్రం చెప్పడు. ప్రత్యాద్రి నోరు జారితే బాల్ తో సమాధానం ఇస్తాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితో కోహ్లిల నోటితో సమాధానం ఇస్తాడు. అతడు ఎవరో కాదు మన హైదరాబాద్ కా షాన్ సిరాజ్. సాధారణంగా టీమ్ ఇండియాలో ఫేస్ రేసుగుర్రం అంటే బుమ్రా అని చెబుతారు. జట్టుకు వికెట్ కావలసి వచ్చినప్పుడు బుమ్రా వైపు చూస్తారు.
అయితే కొద్దిరోజులుగా తీరికలేని ఆట తీరుతో బుమ్రా అలసిపోయాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు మన హైద్రాబాది (సిరాజ్).. తిరుగులేని స్థాయిలో బౌలింగ్ వేస్తూ.. వికెట్లు పడగొడుతూ.. తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో 5 టెస్టులు ఆడి అలుసట ఎరుగని యోధుడు అనిపించుకుడు. ఐదు టెస్టులలో ఏకంగా 185.3ఓవర్లు వేసి.. 23లు వికెట్లు తన ఖాతాలో వేసుకొని జట్టు సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు.. ముఖ్యంగా లండన్ ఓవల్ మైదానంలో జరిగిన ఐదవ టెస్ట్ ఇంగ్లాండ్ చివరి ఇన్నింగ్స్ లో సిరాజ్ తన విశ్వరూపం చూపించాడు.
ఐదో రోజు ఆటలో ఏకంగా మూడు వికెట్లు సాధించి.. టీమిండియా కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. విజయానికి 35పరుగులు కావాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉనాయి. ఇలాటి సమయంలో విజయం మన ఉన్నాది అని ఎవరు అనుకోరు. కానీ సిరాజ్ నేను ఉన్న అని ఒక రేసు గుర్రంల ముందుకొచ్చి వికెట్లు తీసాడు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సిరాజ్ పై మాజీ క్రికెటర్లుతో పాటు రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు.
మ్యాచ్ అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ..
కీలక ప్రదేశాల్లో బంతులు వేసి బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పాడు. వికెట్లు పడతాయా? లేదా? పరుగులు కొడతారా? కొట్టరా? లాంటి విషయాలు అస్సలు పట్టించుకోలేదన్నాడు. బౌండరీ వద్ద హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను అందుకున్న తర్వాత లైన్‌ను తాకుతాననుకోలేదన్నాడు. ”మ్యాచ్ పరిస్థితులను మార్చేసిన క్షణమది. ఆ తర్వాత బ్రూక్ అమాంతం జోరు పెంచేశాడు. టీ20లు ఆడినట్లు ఆడేశాడు. దీంతో మేం కాస్తా వెనకబడ్డాం. కానీ, ఏ దశలోనైనా గెలుస్తామన్న నమ్మకం నాకుండేది. అదే జరిగింది. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు” అని సిరాజ్ తెలిపారు.
వెబ్ డెస్క్
ఎలెందర్