Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభ్యర్థుల జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదం

అభ్యర్థుల జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఆమోదం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సిఫారసు చేసిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ఆమోదిస్తూ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జూమ్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. జాబితా ఆమోదం పొందడంతో నేడు (మంగళవారం) అభ్యర్థులకు బి ఫామ్స్‌ అందజేయనున్నారు.

కేటీఆర్‌ పద్ధతిగా మార్చుకోవాలి :ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌
సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న ప్రతి పనిపై హేళనగా మాట్లాడటం మానుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హ్వార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి యువతకు మంచి సందేశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రయత్నించారని ఆయన తెలిపారు. నేర్చుకునేందుకు, చదువుకునేందుకు వయస్సుతో నిమిత్తం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తే, దాన్ని కూడా హేళనగా మాట్లాడటం కేటీఆర్‌ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

అమాయకులైతే నిరూపించుకోండి :వీహెచ్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎంగా కేసీఆర్‌ను సిట్‌ విచారించడం సరైనదేనని పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆత్మగౌరవం, కక్షసాధింపు అంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు ముందు వారి పాలనలో చేసిన వాటిపై వివరణ ఇచ్చుకోవాలని సూచించారు. చేతనైతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అమాయకులని నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు.

వికలాంగుల హక్కులను ఉల్లంఘించిన కేంద్ర బడ్జెట్‌ సుప్రీంకోర్టులో కేసు వేస్తాం :ముత్తినేని వీరయ్య
వికలాంగుల హక్కుల చట్టం – 2016కు తూట్లు పొడిచిన కేంద్ర బడ్జెట్‌పై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కాంగ్రెస్‌ వికలాంగుల విభాగం చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ చట్టం ప్రకారం వికలాంగులకు 5 శాతం నిధులు కేటాయించాలని తెలిపారు. అయితే 2026 – 27 కేంద్ర బడ్జెట్‌లో 0.0286 శాతం నిధులు మాత్రమే కేటాయించారని తప్పు పట్టారు. ఇది జీడీపీలో 0.008 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇలాంటి బడ్జెట్‌ సమాజంలో అసమానతలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులెక్కువగా అసమర్థమైన నైపుణ్య శిక్షణ పథకాలకు వెళతాయనీ, తద్వారా ఉద్యోగ నియామకాలు తగ్గుతాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -