Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ జాబితా పక్కాగా ఉండాలి

ఓటర్ జాబితా పక్కాగా ఉండాలి

- Advertisement -

– అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ 
నవతెలంగాణ -పెద్దవంగర: తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఓటరు జాబితా తయారు చేయాలని జనగాం జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ ) రోహిత్ సింగ్ అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ వీరగంటి మహేందర్  ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్ఓ) శిక్షణ శిబిరాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదుచేయాలన్నారు. మృతుల తొలగింపు, సవరణ, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలి తదితర అంశాలను, వినియోగించాల్సిన ఫారాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ సుధాకర్, ఉమేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -