నవతెలంగాణ – హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జమ్మూకశ్మీర్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎనిమిది సార్లు ఛాంపియన్ కర్ణాటక జట్టుపై ఫైనల్లో ఆధిక్యం ప్రదర్శించి, తొలిసారి రంజీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. జమ్మూకశ్మీర్ చారిత్రక విజయంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూకశ్మీర్ ప్రస్థానం అద్భుతం అని, సిసలైన పట్టుదలకు వారి ఆటతీరే నిదర్శనమని సచిన్ కొనియాడాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన సచిన్, కశ్మీర్ ప్రాంతానికి క్రికెట్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశాడు. “కశ్మీర్ విల్లో బ్యాట్లు ఎంతోమంది ఛాంపియన్ల కిట్‌లో భాగంగా ఉన్నాయి. ఛాంపియన్లకు బ్యాట్లు అందించే స్థాయి నుంచి, నేడు స్వయంగా ఛాంపియన్లుగా ఎదిగిన జమ్మూకశ్మీర్ ప్రయాణం అమోఘం” అని సచిన్ ట్వీట్ చేశాడు. ఈ విజయం అనుకోకుండా వచ్చింది కాదని, సీజన్ మొత్తం చూపించిన నిలకడైన ఆటతీరు, పట్టుదల వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు.
బ్యాట్లు అందించే స్థాయి నుంచి ఛాంపియన్లుగా ఎదిగిన తీరు అమోఘం: సచిన్
- Advertisement -
- Advertisement -



