నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా ఆర్థిక వ్యవస్థపై అమెరికా ప్రెసిడెంట్ అవాస్తవాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మదురో పాలనలో ఆ దేశం ఆర్థికంగా దివాళ తీసిందని ట్రంప్ కారుకూతలు కూశారు. అంతేకాకుండా చమురు అమ్మకాలతో వచ్చిన నిధులను వెనిజులా ప్రజల సంక్షేమానికి కేటాయిస్తామని బుకాయించారు. తాజాగా వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కౌంటర్ ఇచ్చారు. యూఎస్ ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచిన, భిన్న పరిస్థితుల్లో ఎకానమికల్ గా వెనిజులా దృఢంగా ఉందని దీమా వ్యక్తం చేశారు. ఆర్థికంగా వ్యూహాత్మక ప్రణాళికతో ప్రపంచ మార్కెట్‌లతో భాగస్వామ్యం అయ్యమని రాష్ట్ర టెలివిజన్ VTVలో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా మాట్లాడారు. వెనిజులా పట్ల అమెరికా బహిష్కరణ విధానాన్ని అవలంబించిందని, అదే సమయంలో రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు అసాధారణమైనవి కావు అని నొక్కి చెప్పింది.
వెనిజులా ఎగుమతుల్లో 71% ఎనిమిది దేశాలలో కేంద్రీకృతమై ఉన్నాయని వివరించారు. 25% యునైటెడ్ స్టేట్స్ కోసం ఉద్దేశించబడ్డాయన్నారు. వెనిజులా ఆర్థిక సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో వైవిధ్యభరితంగా ఉన్నాయని ఆమె తెలియజేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించాయని, ఇది అంతర్జాతీయ సహకారానికి తమ చేతులు అందజేయడానికి అందుబాటులోనే ఉంటామని పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి తమ బ్రాండ్ విలువను ప్రపంచానికి చాటి చెప్పామని, ఈ విషయంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోమన్నారు.
ఇంధన సంబంధాలను రోడ్రిగ్జ్ ప్రస్తావిస్తూ… మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను తోసిపుచ్చారు. బాహ్య ఒత్తిడి వెనుక వనరుల ప్రయోజనాలే నిజమైన ప్రేరణ అని అన్నారు. “మాదకద్రవ్యాల అక్రమ రవాణా మొత్తం ఒక సాకు మాత్రమే, వారు ఎల్లప్పుడూ కోరుకునేది వనరులే. మాకు చాలా స్పష్టమైన స్థానం ఉంది: అన్ని పార్టీలు ప్రయోజనం పొందే ఇంధన సంబంధాలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఇక్కడ సహకారం వాణిజ్య ఒప్పందంలో స్పష్టంగా నిర్వచించబడిందన్నారు.



