Monday, July 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంత‌రిక్ష కిటికి..చూపిస్తుంది మీకు…!

అంత‌రిక్ష కిటికి..చూపిస్తుంది మీకు…!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మన ఇంట్లోని కిటికీ ద్వారా కేవలం వీధి వరకు మాత్రమే కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ ప్రత్యేక కిటికీ ద్వారా భూమి మొత్తాన్ని, అంతరిక్ష విహంగమయ్యే దృశ్యాలను కూడా చూడగలం. ఈ అద్భుత విండో పేరు ”కుపోలా”. భూమి నుండి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇది భాగంగా ఉంది. వ్యోమగాములు దీనివద్దకు చేరినప్పుడు, భూమి అందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ”కుపోలా” అనే పదం ఇటాలియన్‌ భాషలో ”గుమ్మడిదానంలాంటి గుడారం” లేదా ”డోమ్‌” అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. గత శనివారం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ పలు శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

7 అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది..!
1990 ల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలుపెట్టారు. దీనిలో పలు మాడ్యుళ్లు ఉన్నాయి. వీటిల్లోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్‌ను 2010లో డిస్కవరీ స్పేస్‌ షెటిల్‌ సాయంతో ఐఎస్‌ఎస్‌కు చేర్చారు. దీంతోపాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటీకీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు. ఇది 2.95 మీటర్ల చుట్టుకొలత.. 1.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీని బరువు 1,880 కిలోలు. మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ.. చుట్టూ ఆరు గాజు కిటీకీలతో పుష్పం డిజైన్‌ను తలపిస్తుంది. అతిపెద్దదైన విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించి 15 ఏళ్లు పూర్తయింది.

ఏడు కిటికీల కీలక పాత్ర…
ఈ ఏడు కిటికీల మాడ్యూల్‌ ఫోటోగ్రఫీకి అసాధారణమైన వ్యూ పాయింట్‌ను అందించడమే కాకుండా, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ రోబోటిక్‌ ఆర్మ్‌, కెనడార్మ్‌ 2 విన్యాసాలు, ఇన్‌కమింగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్‌ చేయడం, స్పేస్‌వాక్‌ల జాగ్రత్తగా ఆర్కెస్ట్రేషన్‌ వంటి బాహ్య కార్యకలాపాలను పర్యవేక్షించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దృశ్య విందు…
ఈ ఏడు కిటికీల చిత్రాలు శాస్త్రీయంగా ముఖ్యమైనవి మాత్రమే కాదు, మన గ్రహం దుర్బలత్వం, వైభవాన్ని చూపిస్తాయి. సున్నితమైన నీలిరంగు కాంతితో కప్పబడిన భూమి, విశాలమైన అంతరిక్ష నేపథ్యంలో ప్రశాంతంగా ఎంతో నిర్మలంగా భూగ్రహం కనిపిస్తుంది. విశ్వం నుండి వచ్చిన ఈ తాజా దృశ్య విందును ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా, శాస్త్రీయ అన్వేషణకు ఒక దీపస్తంభంగా ఈ విండో పనిచేస్తుంది.

నాసా వెనకడుగు… ముందుకొచ్చిన ఐరోపా
కుపోలా రాక ముందు వ్యోమగాములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. తొలుత నాసా-బోయింగ్‌ కలిసి కుపోలాను నిర్మించాలని అనుకున్నాయి. కానీ, వ్యయ నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి. అప్పట్లో నాసాతో ఉన్న బార్టర్‌ ఒప్పందం ఆధారంగా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) 1998 లో దీన్ని తన బాధ్యతగా తీసుకుంది. ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని రూపకల్పన, అభివృద్ధి, అంతర్గత నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది.

శకలాలు, ఉల్కల నుండి రక్షణ …
కుపోలా విండోలపై అంతరిక్షంలో తూళ్ళే శకలాలు, ఉల్కల వల్ల హాని కలగకుండా, ప్రత్యేకమైన షట్టర్లు అమర్చారు. వీటిని నాబ్‌ సహాయంతో మాత్రమే తెరవవచ్చు. అవసరమైనప్పుడే ఇవి తెరవబడతాయి. ఈ విండో ద్వారా అంతరిక్ష కేంద్రం బయట భాగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అంతే కాకుండా, రోబోటిక్‌ చేతుల కదలికలను గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక విధులు లేని సమయంలో వ్యోమగాములు ఇక్కడికి వచ్చి భూమి, అంతరిక్ష అందాలను వీక్షిస్తూ విశ్రాంతి తీసుకుంటారు. ”కుపోలా అనేది వ్యోమగాములను భూమితల్లితో మానసికంగా అనుసంధానించే నాళములాంటి అద్భుతం” అని ఈ ప్రాజెక్టును నిర్మించిన ఐరోపా సంస్థ ఎలినియా స్పాజియోకు చెందిన ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డోరియాన్‌ బఫ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -