మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ ఇది. అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘అందమా అందమా’ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. బుధవారం సెకండ్ సింగిల్ ‘పరిచయ మిలా’ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
సోల్‌ఫుల్ నెంబర్స్‌కి పాపులరైన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఒక బ్యూటీఫుల్ మెలోడీగా స్వరపరిచారు. వనమాలి రాసిన సాహిత్యం అద్భుతంగా ఉంది. వెటరన్ సింగర్ కేఎస్ మెలోడీస్ వాయిస్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. ఆమె మాగటిక్ వాయిస్‌తో సాంగ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. సాంగ్‌లో విజువల్స్ చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సోల్‌ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. ఈ చిత్రం ఈనెల 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సిఇఓ : చెర్రీ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్, ఎడిటర్: శశాంక్ మాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి.
అద్భుతమైన మెలోడీ ‘పరిచయమిలా…’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES