Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆడుతు పాడుతు "హస్తం" నేతల శ్రమదానం

ఆడుతు పాడుతు “హస్తం” నేతల శ్రమదానం

- Advertisement -

నవతెలంగాణ-గంగాధర : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఆడుతు పాడుతు గంగాధర మండల కేంద్రంలో శ్రమదానం పనులు చేపట్టారు. సోమవారం మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా ఛైర్మన్ నరెందర్ రెడ్డి, తదితరులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు ఎస్సీ బాలుర వసతి గృహానికి చేరి పలు శ్రమదానం పనులు చేపట్టారు. మీనాక్షి నటరాజన్ చీపురు పట్టి మరుగుదొడ్లను శుభ్రం చేయగా, మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం వసతి గృహం ఆవరణలో మట్టిని పోసి చదును చేశారు. కొందరు గోడలకు పేయింటింగ్ వేయగా, ప్రతీ ఒక్కరు వరుస క్రమంలో నిలబడి మట్టిని అందిస్తూ కూరగాయల పెంపకానికి అనువుగా కుండీలలో మట్టిని నింపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంంచార్జీ మీనాక్షి నటరాజన్ హిందీలో ఓ పాటను ఆలపించగా, పార్టీ శ్రేణులు పల్లవిని అందిస్తూ ఉత్సాహ పరిచారు. కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రమదానం పనులు ఆడుతు పాడుతు అలసట లేకుండా కొనసాగించిన తీరు చూడ ముచ్చగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -