- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్ ’ పేరిట పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ తీసుకున్న చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ.. ప్రపంచం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రతిపక్షాలు సైతం భారత సైన్యం చర్యలను కొనియాడుతున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టినా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి.
- Advertisement -