Monday, May 5, 2025
Homeసినిమాప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్క్రీన్‌ ప్రాజెక్ట్‌

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్క్రీన్‌ ప్రాజెక్ట్‌

- Advertisement -

అత్యంత వైభవంగా జరుగుతున్న ‘వేవ్స్‌ 2025’లో నాగపూర్‌లో నిర్మించబోయే వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ సినిమా స్క్రీన్‌ ప్రాజెక్ట్‌ను ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌, విక్రమ్‌ రెడ్డి ప్రకటించారు.
ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ సినిమా స్క్రీన్‌తో నాగపూర్‌లో మొదటిసారిగా నిర్మించబోయే ఈ సినిమా థియేటర్‌ భారతీయ సాంకేతిక రంగానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఎంటర్‌టైన్మెంట్‌లో మోడరన్‌ ఇండియాకి ఇది ఒక గర్వకారణంగా మారబోతోంది.
‘వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ సినిమా స్క్రీన్‌ నిర్మించేందుకు అవకాశం దక్కడం నాకు గర్వకారణం. ఇండియన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని ప్రపంచస్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రధాని లక్ష్యం. అదే ప్రేరణగా ఈ ప్రయత్నం మొదలైంది. మా విజన్‌ని అర్థం చేసుకుని ఈ కలను నిజం చేసేందుకు మమ్మల్ని నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కి నా హదయపూర్వక కతజ్ఞతలు’ అని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అన్నారు. ‘సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యువీ క్రియేషన్స్‌ లక్ష్యం. గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు కూడా నిర్మించడమే మా ధ్యేయం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్‌ని నాగపూర్‌లో నిర్మించబోతున్నాం. మా పరిశ్రమ సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి మా కతజ్ఞతలు’ అని విక్రమ్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -