- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జల్పల్లి షాహిన్‌నగర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మొహ్మద్ నసీర్‌ను అతని స్నేహితులే కత్తులతో పొడిచి హతమార్చారు. నసీర్ నిత్యం కత్తి పట్టుకుని తిరుగుతూ, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని స్నేహితులను బెదిరించడంతో అతనిపై అసహనం పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగేందుకు తీసుకెళ్లి, ‘మమ్మల్ని బెదిరిస్తావా’ అంటూ నలుగురు కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారు. సోమవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



