నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినిమా ప్రదర్శనలు యధావిధిగా కొనసాగుతాయని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. మే 24న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన దామోదర ప్రసాద్.. సమస్యలపై మే 30న కమిటీ వేస్తున్నామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇండస్ట్రీ కోసం కలిసి పనిచేయాల్సిందేననన్నారు. ఎవరికి వారు ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తున్నారని.థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు దామోదర ప్రసాద్. త్వరలోనే చిత్రపరిశ్రమలో అన్ని వర్గాలను కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. కొన్ని సమస్యలను త్వరలోనే సినిమాటో గ్రఫి మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి చర్చిస్తామన్నారు.
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ లేదు: దామోదర ప్రసాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES