Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆపిల్ స్టోర్‌లో చోరీ

ఆపిల్ స్టోర్‌లో చోరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓవైపు ట్రంప్ చ‌ర్య‌ల‌తో లాస్ ఏంజెల్స్ అట్టుడుకుతుండా..మ‌రోవైపు స్థానికంగా ఉన్న ఆపిల్ స్టోర్‌లో ప‌లువురు చోరీ చేశారు. సంద‌ట్లో సండేమియాలాగా అందిన‌కాడికి ఆపిల్ ఫోన్ల‌ను దోచుకెళ్లారు. సోమవారం రాత్రి డౌన్టౌన్ లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఉన్న యాపిల్ స్టోర్లోకి ఆందోళనకారుల ముసుగులో కొందరు మాస్క్ ధరించి చొరబడ్డారు. యాపిల్ స్టోర్ను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేసి లోపలికి వెళ్లి యాపిల్ ఐ ఫోన్లు, యాపిల్ వాచ్లు, ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ను దోచుకుని అక్కడ నుంచి ఉడాయించారు. ఈ లూటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

అక్రమ వలసదారుల ఏరివేత కోసం అమెరికా సర్కారు తీసుకుంటున్న బలవంతపు చర్యలకు వ్యతిరేకంగా లాస్ఏంజెల్స్లో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు, ఆందోళనలూ ఐదో రోజుకు చేరుకున్నాయి. నాలుగో రోజూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనలను నియంత్రించేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్​ట్రంప్​మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో 2 వేల మంది నేషనల్‌‌ గార్ట్స్ను లాస్ ఏంజెల్స్కు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad