- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలో శుక్ర వారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు మనోహరాబాద్ గ్రామంలోని శివాలయంలో చోరీ జరిగింది. గర్భగుడి తాళాలు పగలగొట్టి శివుని వెండి విగ్రహం హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి ఏఎస్ఐ శంకర్, క్లోస్ టీం ద్వార పలు ఆధారాలను సేకరించినారు. గుడి పూజారి దుండి ప్రకాష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ శంకర్ తెలిపారు. గ్రామాలలో దొంగతనాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు దోహదం చేస్తాయని, గ్రామప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.
- Advertisement -